పెద్దపల్లి జిల్లా ముత్తారంలో సీపీఎం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలు ఆందోళన నిర్వహించారు. 13 రోజులుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయటాన్ని నిరసిస్తూ... ర్యాలీ తీశారు. డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. పదేళ్లుగా ఏరోజు కరెంటు బిల్లులు కట్టాలని అడగని అధికారులు... ఇప్పుడు ఏకంగా 50 నుంచి 70 వేల బిల్లు కట్టాలనటం అన్యాయమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బకాయిలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సబ్‌స్టేషన్ ముట్టడించారు. ఒక్క రోజులో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు విద్యుత్ అధికారులు మాత్రం అనేకసార్లు హెచ్చరించినా... ఎవ్వరూ స్పందించి బిల్లులు కట్టలేదని చెబుతున్నారు. 2013 నుంచి నేటి వరకు బకాయిలు చెల్లించకపోవడం వల్లే... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత