ETV Bharat / state

'పదేళ్లుగా బిల్లు ఇవ్వకుండా ఇప్పుడు 60 వేలు కట్టమంటే ఎలా?' - MUTTARAM VILLAGERS PROTESTED FOR CURRENT CONNECTIONS

"పదేళ్ల నుంచి ఒక్క నెల కూడా బిల్లు అడగలేదు. ఇప్పుడు ఏకంగా రూ.60 వేల, రూ.70 వేలు కట్టాలని బిల్లులు చేతులో పెడుతున్నారు. కట్టలేమనగానే కరెంటు కనెక్షన్లు తొలగించారు. ఒక్కసారిగా అంత మొత్తం ఎలా కట్టాలి. ఇన్ని రోజులవి మాఫీ చేసి... ఇప్పటి నుంచి కొత్తగా బిల్లులివ్వడి కడతాం"- ముత్తారం ప్రజలు

MUTTARAM VILLAGERS PROTESTED FOR CURRENT CONNECTIONS
MUTTARAM VILLAGERS PROTESTED FOR CURRENT CONNECTIONS
author img

By

Published : Dec 14, 2019, 9:39 PM IST

పెద్దపల్లి జిల్లా ముత్తారంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ధర్నాకు దిగాయి. రహదారిపై 2 గంటల పాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పదేళ్లుగా కరెంటు రీడింగ్​ తీసుకెళ్లటమే కానీ... ఏ ఒక్క నెలా బిల్లు ఇవ్వకుండా ఒక్కసారే వేలకు వేలు చెల్లించాలనటం అన్యాయమని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కోక్కరికి సుమారు రూ.60 నుంచి 70 వేల బిల్లులు ఇవ్వటం దారుణమని మండిపడ్డారు.

ముత్తారంలో ఉన్న రెండు నుంచి మూడు వందల ఎస్సీ, ఎస్టీ ఇళ్లకు పదేళ్ల క్రితం జీరో కనెక్షన్ల పేరిట మీటర్లు బిగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బిల్లులనే మాటే లేదు. ఇప్పుడున్న నియమాల ప్రకారం అధికారులు... స్థానికులను అప్రమత్తం చేశారు. బిల్లులు కట్టాలని... లేని పక్షంలో కనెక్షన్లు తీసేస్తామని గడువిచ్చారు. ఈ నెల 3 న గడువు పూర్తి కావటం వల్ల కనెక్షన్లను అధికారులు తొలగించారు.

ఇప్పటి వరకున్న బకాయిలు మాఫీ చేసి... ఇక నుంచి బిల్లులు ఇవ్వాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. తొలగించిన కనెక్షన్లు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తున్నారు.

'పదేళ్లుగా బిల్లు ఇవ్వకుండా ఇప్పుడు 60 వేలు కట్టమంటే ఎలా?'

ఇదీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన

Intro:విద్యుత్ కోసం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన గ్రామస్తులు.

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని
ముత్తారం గ్రామంలోసుమారు 200 నుంచి 300 ఎస్సీ, ఎస్టీ కుటుంబ లు నివసిస్తున్నారు.

గత పదేళ్ల క్రితం ఆ కుటుంబల వారికి ఇంటికి విద్యుత్ మీటర్లు పెట్టడం జరిగింది.
,మీటర్లు బిగించే సమయంలో గ్రామస్థులు ఎంత వద్దు అని చెప్పిన అధికారులు వినకుండా రోజు వారీ విద్యుత్ ఎంత వినియోగిస్తున్నారు అన్ని తెలుసుకోవడానికి మీటర్లు పెడుతున్నామని చెప్పడం జరిగింది అన్ని అన్నారు.
పదేళ్లుగా రీడింగ్ తీసుకెళ్లడం మే కానీ ఏ ఒక నెల కూడా బిల్ ఇవ్వలేదని ,గ్రామస్థులు కూడా విద్యుత్ బిల్లులు కట్టలేదు.
గత వారం రోజుల క్రితం ఒకే సారి వెయ్యిల రూపాయల బిల్లులు చెల్లించాలని అధికారులు తెలపడంతో అందరూ అవాక్కయి పోయారు. ప్రస్తుతం విద్యుత్ బిల్లు చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని చెప్పి గత 10 రోజుల క్రితం నుంచి విద్యుత్ నిలిపి వేయడం జరిగింది, ప్రస్తుతం ఆ కాలనీ వాసులు అంధకారం లో గడప వలసి వస్తుంది, రెక్కాడితే కానీ డొక్కా డాని మేము అంత విద్యుత్ బిల్లులు మేము ఎక్కడ నుండి కడుతామని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ ఇళ్లకు తొలగించిన విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని, ప్రస్తుతం ముగిసిన తర్వాత వచ్చి బిల్లులను కడతామని, వారికి మద్దతుగా ఈరోజు ముత్తారం మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై రెండు గంటలపాటు బైఠాయించి ధర్నా చేశారు.Body:యం.శివప్రసాద్, మంథని.Conclusion:9440728281.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.