అంబేడ్కర్ ఓ వర్గానికి మాత్రమే చెందినవాడు కాదని, ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని... పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత అన్నారు. ప్రతి వ్యక్తి చదువుకోవాలని, చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహదేవపూర్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని... పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలసి ఆయన ఆవిష్కరించారు.
మహానీయుల ఆశయాలను తప్పక ఆచరించాలని... భూపాలపల్లి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి తెలిపారు. మహదేవ్పూర్ ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహాం ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని ఆమె పేర్కొన్నారు. మహానీయుల చరిత్ర తెలిసేలా వారి విగ్రహాలు నెలకొల్పకుండా గత పాలకులు ప్రజలను మోసం చేశారని... పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు ఆరోపించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు ఈ-పంచాయత్ పురస్కారం