పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ పనులను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. 5వ వార్డు పరిధిలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నిర్మించనున్న 2 మంచినీటి ట్యాంకుల పనులను పురపాలక ఛైర్మన్ దాసరి మమత రెడ్డితో కలిసి ప్రారంభించారు.
రూ.35 కోట్లతో నిర్మించనున్న 2 ట్యాంకులతో పట్టణంలోని ప్రతి ఇంటికీ మంచి నీరు అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- 'నీట్, జేఈఈ రాసేందుకు విద్యార్థులు సుముఖం'