ETV Bharat / state

పైపు బోల్టులు పీకేసిన రైతులు... లీక్​ అయిన భగీరథ నీరు

నీరు లేక తమ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు మిషన్ భగీరథ పైప్​లైన్​ బోల్టులు పీకేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో చోటు చేసుకుంది.

mission bhagiratha pipe leakage at palakurthy mandal in peddapalli district
పైపు బోల్టులు పీకేసిన రైతులు... లీక్​ అయిన భగీరథ నీరు
author img

By

Published : Mar 31, 2021, 12:33 PM IST

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు శివారులో గూడూరు ప్రధాన రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ పైప్​లైన్ లీక్​ అయింది. పరిసర గ్రామాల రైతులు నీళ్లు లేక తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ పైప్​ లైన్​ గేటువాల్వ్​ వద్ద బోల్టులు తీసేశారని అధికారులు తెలిపారు. లీకేజ్​తో వచ్చిన తాగునీటిని తమ పొలాలకు మళ్లించుకున్నారని వెల్లడించారు.

తాగునీరు బయటకి వస్తుందని సమాచారం అందుకున్న అధికారులు వెంటనే నీటి సరఫరాను ఆపేశారు. వెంటనే అధికారులు మరమ్మతులు చేశారు. రైతులు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ... సహనంతో ఉండాలంటూ మిషన్ భగీరథ అధికారులు సూచించారు.

పైపు బోల్టులు పీకేసిన రైతులు... లీక్​ అయిన భగీరథ నీరు

ఇదీ చూడండి: దిల్లీ ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.