ETV Bharat / state

Minister KTR Peddapalli District Tour Today : పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో నేడు మంత్రి కేటీఆర్ బిజీబిజీ - Dasabdi Pragati Meeting in Peddapalli

Minister KTR Peddapalli District Tour Today : మంత్రి కేటీఆర్​.. నేడు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ప్రగతి బహిరంగ సభలో మంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు.

KTR Latest Development Programmes
KTR Peddapalli Tour
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 11:09 AM IST

Updated : Oct 1, 2023, 11:52 AM IST

Minister KTR Peddapalli District Tour Today : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ రాష్ట్రంలోని రెండు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయునున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముందుగా మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో రూ.313 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం పామాయిల్​ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. తరవాత పెద్దపల్లి జిల్లాలో సింగరేణి స్థలంలోని నిర్వాసితులకి పట్టాలు ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

KTR Mancherial Tour Details : మంత్రి కేటీఆర్​ మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, క్యాతనపల్లి పురపాలికల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ జిల్లాలో రూ.313 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ పురపాలికలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న పామాయిల్​ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి 560 డబుల్​ బెడ్ రూమ్​ ఇళ్ల నిర్మాణాలు, మహిళా భవన్​ , మిషన్​ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరంలో మందమర్రి నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. ఈ పర్యవేక్షణ పనులు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ పరిశీలన చేసి.. ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు.

KTR About NTR in Khammam Tour : 'మాకు రాముడైనా.. కృష్ణుడైనా ఎన్టీఆరే.. తారకరాముడు.. ఆ పేరులోనే పవర్ ఉంది'

KTR Speech at Singareni : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతమంతా గులాబీ మయమైంది. సింగరేణి స్టేడియంలో దశాబ్ది ప్రగతి సభ(Dasabdi Pragati Sabha) ఏర్పాట్లను బీఆర్ఎస్​ నాయకులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సింగరేణి స్టేడియంలో రెండు వేదికలు ఏర్పాటు చేశారు.

KTR Development Programmes in Peddapalli : ఒక వేదికపై రూ.100 కోట్ల నిధులకు సంబంధించి అభివృద్ధి పనుల్లో భాగంగా ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పార్క్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సింగరేణి నివాస ప్రాంతాలలో ఉన్న వారికి పట్టాలు అందించనున్నారు. అలాగే అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కురుజు కమ్మి భూముల సంబంధించిన శాశ్వత పట్టాలను మంత్రి చేతుల మీదుగా అందించరున్నారు. అనంతరం మరో వేదికపై మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కేటీఆర్​ పర్యటన(KTR Tour) ఏర్పాట్లను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరిశీలించారు.

Kitex and Sintex Companies Invests in Telangana : రాష్ట్రానికి మరో రెండు కొత్త పరిశ్రమలు.. 1200 వేల మందికి ఉపాధి

Opposition Leaders Arrest Due to KTR Tour : మంత్రి కేటీఆర్​ పర్యటన భద్రతా విషయంలో భాగంగా.. కాంగ్రెస్​, బీజేపీ, సీపీఐ, హెచ్​ఎంఎస్​ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్​లు చేసి పోలీస్​ స్టేషన్​కి తరలించారు. రామగుండంలో రెండు రోజులుగా ఫ్లెక్సీల వివాదం నెలకొంది. అధికార పార్టీ నీట రాజకీయాలకు పాల్పడుతోందని.. ఇండస్ట్రీయల్​ ఏరియాగా పేరుగాంచిన రామగుండం అభివృద్ధిపై అన్ని పార్టీ నాయకులతో చర్చించాలని.. దీనికి వ్యతిరేకంగా అరెస్ట్​లు చేస్తున్నారని ప్రతిపక్షనాయకులు ఆరోపించారు.

KTR Playing Football Video Viral : పుట్​బాల్​ ఆడుతూ గోల్​ కొట్టిన కేటీఆర్​.. వీడియో వైరల్

KTR Speech in Wanaparthy Ten Years Progress : 'తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానికి ఎందుకంత కక్ష?'

Last Updated : Oct 1, 2023, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.