పెద్దపెల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోదావరిఖనిలోని జవహర్‌నగర్ దుర్గాదేవి ఆలయంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
దుర్గామాత ఆశీస్సులతో రైతులంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి కోరుకున్నారు. సింగరేణి కార్మికులు విధుల్లో ఎలాంటి అటంకాలు కలగకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.