జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన 35 మంది వలస కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూర్ పవర్ ప్లాంట్లో పని చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇన్ని రోజులు తీవ్ర ఇబ్బందులు పడ్డ వీరు... ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో స్వస్థలాలకు చేరొచ్చని ఆశపడ్డారు.
యాజమాన్యం తమకు ఎలాంటి సౌకర్యాలు చేకూర్చకపోయేసరికి... మూడు రోజులుగా ప్లాంటు ముందు ఆందోళన చేశారు. అప్పటికీ ఎవ్వరూ పట్టించుకోకపోయేసరికి ఇక చేసేదేమీలేక కాలిబాట పట్టారు. రామగుండానికి పయనమైన ఈ వలస కార్మికులు పెద్దపల్లి జిల్లా మంథనికి చేరుకున్నారు.
![migrants problems in lock down time to reach own places](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-105-8-valasakaarmikulanadaka-av-ts10125_08052020122718_0805f_1588921038_658.jpg)
దారిలో ఏ అధికారులు తమను అడ్డుకోలేదని కార్మికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వలస కూలీల కష్టాలు తీర్చి స్వస్థలాలకు చేర్చాలని కోరుతున్నారు.
![migrants problems in lock down time to reach own places](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-105-8-valasakaarmikulanadaka-av-ts10125_08052020122718_0805f_1588921038_30.jpg)
![migrants problems in lock down time to reach own places](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-105-8-valasakaarmikulanadaka-av-ts10125_08052020122718_0805f_1588921038_724.jpg)