పెద్దపల్లిలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ పత్తి సంచులతో నిండిపోయింది. సోమవారం అమావాస్య కావడంతో మార్కెట్‌కి ఆదివారం సహా వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఇవాళ ఉదయం మార్కెట్ తెరుచుకోవడంతో జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున పత్తి తీసుకొచ్చారు. సుమారుగా 3600 బస్తాలు మార్కెట్‌కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రద్దీ పెరిగి తూకం ఆలస్యంగా జరుగుతోంది. అధికారులు అదనపు ఏర్పాట్లు చేయనందున రైతులు మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.