పెద్దపల్లి జిల్లా మంథనిలో మహా శివరాత్రి పర్వదినాన పవిత్ర గోదావరికి పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. మంథని మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గోదావరిలో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల భక్తులు లోనికి వెళ్ళకుండా అధికారులు కంచెను ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. భక్తులు స్నానాలు చేసి గోదావరి ఒడ్డున కొలువై ఉన్న అతి పురాతన దేవాలయం గౌతమేశ్వర స్వామికి పూజలు చేశారు.
ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు