ETV Bharat / state

లాక్​డౌన్​ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - పెద్దపల్లి జిల్లాలో లాక్​డౌన్​

లాక్​డౌన్​ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ఉద్యోగులు, కార్మికులు గుర్తింపు కార్డును వెంట ఉంచుకుని విధులకు వెళ్లాలని సూచించారు.

lockdown execution inspected by ramagundam cp
లాక్​డౌన్​ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
author img

By

Published : May 12, 2021, 8:21 PM IST

Updated : May 13, 2021, 9:20 PM IST

లాక్​డౌన్​ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో లాక్​డౌన్​ అమలు తీరును రామగుండం పోలీస్ కమిషనర్​ సత్యనారాయణ పరిశీలించారు. ఉదయం 10 గంటల తర్వాత నిబంధనలు కఠినంగా ఉంటాయని, ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా పోలీసులకు సహకరించాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు మోహరించారని సీపీ తెలిపారు.

2వేల మంది సిబ్బందితో 10 చెక్​పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 20 బృందాలతో లాక్​డౌన్​ ప్రక్రియను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో విధులు నిర్వహించే కార్మికులు, ఉద్యోగులు గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. లాక్​​డౌన్​ అమలుతో పారిశ్రామిక ప్రాంతంలోని రోడ్లు బోసి పోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కరోనా సోకిన వారు అధైర్య పడకుండా డాక్టర్ల సూచనలు పాటిస్తూ మహమ్మారిని జయించాలని సీపీ ధైర్యం చెప్పారు.

ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్

Last Updated : May 13, 2021, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.