పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. లాక్‌డౌన్‌తో ఎవరూ బయటకు రాలేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కరోనా బారిన పడి వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఓఎస్డీ చంద్ర పవార్ నేతృత్వంలో గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం, బసంత్‌నగర్, అంతర్గం, పాలకుర్తి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రిజర్వు పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: గ్రేటర్లో లాక్‌డౌన్ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు