రేపు జరిగే రెండో విడత ప్రాదేశిక ఎన్నికల నిర్వాహణకు పెద్దపల్లి జిల్లాలో అధికారులు పోలింగ్ సామాగ్రి పంపిణీ చేపట్టారు. జిల్లాలోని సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, పెద్దపల్లి మండలాల్లోని 6 జడ్పీపీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు మండలాల్లో 378 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2274 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. శాంతి భద్రతల దృష్ట్యా 700 మంది పోలీసు సిబ్బంది నియమించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: చిక్కుల్లో రవిప్రకాశ్.. టీవీ9 సీఈవోగా తొలగింపు