వరుసగా రెండు రోజులు వివాహాలు ఉండడంతో ఆ ప్రభావం పత్తి మార్కెట్‌పై పడింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్‌కు రోజు వచ్చే పత్తి భారీస్థాయిలో పడిపోయింది. గురువారం మార్కెట్ యార్డ్‌లో పత్తి అమ్మకానికి మందకొడిగా వచ్చింది. దీంతో మార్కెట్ పరిసరాలు వెలవెలబోయాయి.
ప్రతిరోజు 600 బస్తాలకు పైగానే పత్తి వస్తుండగా ఆ సంఖ్య కాస్త 150కి పడిపోయింది. తెల్లబంగారం రాక తగ్గడంతో మార్కెట్ వ్యాపారులు భారీగానే ధరలు కేటాయించారు. ఈరోజు అత్యధికంగా క్వింటాల్ పత్తికి రూ.5600 ధర కేటాయించడం ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు రైతులు అధికశాతం తేమతో పత్తిని తీసుకురావడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు నిరాకరించారు.