ETV Bharat / state

'కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీని అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలి'

వానాకాలం పంటకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలీవరిని అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కరీంనగర్ కలెక్టర్​ శశాంక అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ రైస్ డెలివరీ సంబంధిత అంశంపై కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో అధికారులు, రైస్​ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Oct 27, 2020, 9:01 PM IST

Karimnagar-collector-shashanka
కరీంనగర్ కలెక్టర్​ శశాంక

అక్టోబర్ చివరి నాటికి బియ్యం మిల్లు యజమానులు వానాకాలం పంటకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ రైస్ డెలివరీ సంబంధిత అంశంపై కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో అధికారులు, రైస్​ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా రైస్​ మిల్లర్లు వేగంగా రైస్ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ పేర్కొన్నారు. రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్​కు సంబంధించి పెండింగ్​లో ఉన్న సీఎంర్ రైస్​ను ఎఫ్.సి.ఐ గోదాంలకు అక్టోబర్ చివరి వరకు డెలివరీ చేయాలని ఆదేశించారు. రబీ సీజన్​కు సంబంధించి సీఎంఆర్ 5,18,101 మెట్రిక్ టన్నులను డిసెంబర్ 20 నాటికి పూర్తి చేయాలని, ఆ దిశగా అనుసరించే వ్యూహం, కార్యాచరణకు సంబంధించిన నివేదికను ప్రతి రైస్ మిల్ అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 24 గంటలు రైస్ మిల్లులో పని కొనసాగాలని, వీలైనంత త్వరగా రబీ సీజన్ ధాన్యం డెలివరీ చేయాలని ఆదేశించారు. బియ్యం నాణ్యత అంశానికి సంబంధించి రైస్ మిల్లర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చూడండి.. 'అడ్డగుట్ట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్ని పరిష్కరించాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.