ETV Bharat / state

ఎల్లంపల్లికి కాళేశ్వర గంగ... ఒకేసారి 9 మోటార్లతో ఎత్తిపోత - ellampally project news

శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి కాళేశ్వర గంగ ఉప్పొంగుతోంది. ఒకేసారి 9 పంపు మోటర్లతో 23,490 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎల్లంపల్లి జలాశయంలో నీటి నిల్వ 10.52 టీఎంసీలు నీటి మొత్తం 143.91 మీటర్లకు చేరింది.

kaleshwaram water release to ellampally reservoir

author img

By

Published : Aug 12, 2020, 4:36 AM IST

పెద్దపెల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయానికి కాళేశ్వరం నీరు ఎత్తిపోస్తున్నారు. అంతర్గాం మండలం గోయల్​వాడలోని పార్వతి పంప్​హౌస్ నుంచి 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలను విజయవంతంగా చేపట్టారు. ఒకేసారి మొత్తం 9 పంపు మోటర్లతో 23,490 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం పూర్తి సామర్థ్యం నీటి నిల్వ 20 టీఎంసీలు, నీటి మట్టం 148 మీటర్లు కాగా.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎల్లంపల్లి జలాశయంలో నీటి నిల్వ 10.52 టీఎంసీలు నీటి మొత్తం 143.91 మీటర్లకు చేరింది.

ఎల్లంపల్లికి కాళేశ్వర గంగ... ఒకేసారి 9 మోటార్లతో ఎత్తిపోత

మొత్తం ఇన్​ఫ్లో 24, 408 క్యూసెక్కులు కాగా... మొత్తం అవుట్ ఫ్లో 16,371 క్యూసెక్కులుగా ఉంది. గోదావరి ఎగువ నుంచి 918 క్యూసెక్కులు ఇన్​ఫ్లో వస్తుంది. నంది పంప్​హౌస్ ద్వారా శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి 15,750 క్యూసెక్కులు, ఎన్టీపీసీ తాగునీటి పథకాలకు 621 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా అనుమానం: ఫ్యానుకు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.