పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయంలోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నారు. అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతి పంప్‌హౌజ్ నుంచి 4 పంపు మోటర్ల ద్వారా 10,400 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోతలను ప్రారంభించారు.
అయితే గత కొద్ది రోజుల కిందట ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. మరల కాళేశ్వరం జలాలను తిరిగి ఎల్లంపల్లి జలాశయంలోకి వదులుతున్నారు. పంప్‌హౌజ్ డెలవరీ చాంబర్ ద్వారా నీరు అప్రోచ్ కాలువలో పడి ఎల్లంపల్లి జలాశయంలోకి కలవడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండల మారనుంది.
ఇవీ చూడండి: మేడారం: 7రోజుల్లో రూ.10కోట్ల హుండీ ఆదాయం