పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మేయర్ అనిల్ కుమార్, సీపీ సత్యనారాయణ హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ... ఓ మొక్క నాటి, రక్షణ బాధ్యత తీసుకోవాలని సీపీ అన్నారు.
గోదావరిఖని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే లక్ష్యంగా మొక్కలు నాటుతున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 25వేల మొక్కలు నాటినట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభిషేక రావు, గోదావరిఖని ఏసీపీ ఉపేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటిన డీజీపీ