ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) పాలనలో ప్రపంచంలోనే దేశం ప్రత్యేక గుర్తింపు పొందిందని పెద్దపల్లి జిల్లా మంథని భాజపా(BJP) నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. కరోనా విపత్కర సమయంలో మోదీ సమర్థవంతంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భాజపా అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 500 మంది కరోనా బాధిత నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
'సేవా హి సంఘటన్' పేరుతో అనసూయమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పేద ప్రజలకు భాజపా, ట్రస్ట్ అండగా ఉంటుందని సునీల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు వేల్పుల రాజు, టౌన్ ప్రెసిడెంట్ ఎడ్ల సదా శివ, ట్రస్ట్ డైరెక్టర్ వీరబోయిన రాజేందర్, మండల కార్యదర్శి పబ్బ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దారుణం: బాలికపై పెద్దనాన్న అత్యాచారం