పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పార్వతి పంపు వద్ద నుంచి మోటార్ల ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతలు నిరంతరాయంగా కొనసాగుతుండడం వల్ల నీటిమట్టం పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. గత నెలలో ఎల్లంపల్లి నుంచి శ్రీ రాజరాజేశ్వర మధ్య మానేరు జలాశయంలోకి నిరాటంకంగా ఎత్తిపోతలు చేపట్టారు. అప్పుడు 13.93 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం 145.58 మీటర్లకు తగ్గింది.
గత నెల 27 నుంచి ఈ నెల 5 వరకు ఎత్తిపోత నిలిపివేశారు. మరోవైపు గోయల్ వాడాలోని పార్వతి పంప్ హౌజ్ నుంచి రెండు మూడు మోటార్ల ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోతలను కొనసాగిస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి మట్టం 18.70 టీఎంసీలకు చేరుకుంది.
ఇవీ చూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా?