అడవుల పెంపకంతోనే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుందని పెద్దపల్లి అటవీ శాఖ రేంజ్ అధికారి నాగయ్య తెలిపారు. పెద్దపల్లి అటవీ శాఖ క్షేత్రస్థాయి కార్యాలయంలో పెద్దపల్లి రేంజ్ సిబ్బంది ఆధ్వర్యంలో జాతీయ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రంలో 33 శాతం అడవుల పెంపకంమే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిందని నాగయ్య పేర్కొన్నారు. వనాలు, వన్యప్రాణులు జాతీయ సంపద అని... వాటికి నష్టం వాటిల్లితే మానవ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. అడవి జాతీయ సంపద అని... దాన్ని నాశనం చేసే పని ఎవరు చేపట్టినా వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు.