ప్రభుత్వ ఆశయ సాధన దిశగా అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని జిల్లా నూతన కలెక్టర్ డా.సంగీత సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా డా.సంగీత నేడు బాధ్యతలు స్వీకరించారు.
పెద్దపల్లి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉందని, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తానని తెలిపారు. జిల్లా పేరును పెంచే విధంగా కృషి చేస్తానని, దానికి అందరి సహకారం కావాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ.. పచ్చదనం పెంపొందిస్తామని పేర్కొన్నారు.
ప్రణాళికా బద్ధమైన అభివృద్ధికి ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన గ్రామ పంచాయతి చట్టం, మున్సిపాల్ చట్టాలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. జిల్లాలోని ప్రజల భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో వాటిని అమలు చేయడానికి కృషి చేస్తానని అన్నారు.
ఇదీ చూడండి: 'అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి యువతి అదృశ్యం'