తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని.. అంతర్గాం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో లక్షలకోట్ల అప్పు చేసిందని ఎద్దెవా చేశారు. రైతులకు రుణాలు ఇవ్వాల్సిన తెలంగాణ సర్కారు అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. దళిత గిరిజనులకు సంబంధించిన సబ్ ప్లాన్ నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరిన భట్టి.. రాష్ట్రంలో ఉన్న నీళ్లు, కొలువులు స్థానికంగా వినియోగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కిగౌడ్, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఘట్కేసర్ అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు