పెద్దపల్లి జిల్లాలో స్వశక్తి సంఘాలు ఆర్థిక స్వాలంభన దిశగా చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న శానిటరీ న్యాప్కిన్ తయారీ కేంద్రం, బట్ట సంచుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. న్యాప్కిన్ తయారు చేసే విధానం, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెటింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలోని మహిళలంతా తప్పనిసరిగా న్యాప్కిన్లు వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాపారపరంగా ఇతర జిల్లాలో ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ నిషేదించిన తర్వాత వాటి స్థానంలో బట్ట సంచులను వినియోగించాల్సి వస్తుందన్నారు. బట్ట సంచులకు జిల్లాలో అధిక మార్కెట్ అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఇవీ చూడండి: కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త