తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలంతా కేసీఆర్కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ సేవాగుణం చాటుకుంటున్నారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో జడ్పీటీసీ సంధ్యారాణి ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు ముందస్తు వేడుకలు నిర్వహించారు. పింఛనుదారులు, వృద్ధులు.. ముఖ్యమంత్రికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. 'సల్లంగుండు బిడ్డా... కేసీఆర్' జన్మదిన శుభాకాంక్షలు అంటూ.... పంట పొలాల మధ్య ప్లకార్డులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
- ఇదీ చూడండి : 'కేసీఆర్కు హరిత కానుక ఇవ్వడానికే.. కోటి వృక్షార్చన'