ETV Bharat / state

'భాస్కరరావు మృతి కార్మిక లోకానికి తీరని లోటు' - singareni

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాస్కర్​రావు భవన్​లో మాదిరెడ్డి భాస్కర్​రావు 29వ వర్థంతి సభను ఏర్పాటు చేశారు. కార్మిక ఉద్యమ నేత భాస్కర్​రావు ఆశయాలను కొనసాగించాలని ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు పేర్కొన్నారు.

camrade madhireddy bhaskar rao death anniversary
'కామ్రేడ్​ భాస్కర్​రావు ఆశయాలను కొనసాగించాలి'
author img

By

Published : Jul 1, 2020, 12:41 PM IST

కార్మిక ఉద్యమనేత, అమరజీవి మాదిరెడ్డి భాస్కర్​రావు ఆశయాలను కొనసాగించాలని ఏఐటీయూసీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వై. గట్టయ్య, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ ఎం.నారాయణ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాస్కర్​రావు భవన్​లో​ జరిగిన మాదిరెడ్డి భాస్కర్ రావు 29వ వర్ధంతి సభలో పలువురు పాల్గొని మాట్లాడారు. భాస్కర్​రావు కార్మికుల సమస్యలను, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అనేక రకాలుగా కృషి చేసిన మహానీయుడని కొనియాడారు.

సీపీఐ , ఏఐటీయూసీల బలోపేతం కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. కొంతమంది స్వార్థపరుల ఉనికి కోసం భాస్కర్ రావును హత్య చేయడం బాధాకరమన్నారు. ఆయన కార్మికులు, ప్రజల మనసులో చిరకాలం నిలిచిపోతారన్నారు. అనంతరం గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం సమీపంలోని భాస్కర్​రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేల్పుల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ, ప్రజాసంఘాల నాయకులు మేరుగు రాజయ్య, వైవీ రావు, రంగు శ్రీనివాస్, గోపిక మోహన్, కె.కనకరాజ్, భాస్కర రావు కుమారులు శేషు కుమార్, నాగరాజ్, శ్రీధర్​ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: బిరాబిరా గోదావరి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.