ETV Bharat / state

దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది: భాజపా - దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుంది

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణతో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్​వీ సుభాష్​ సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుందని సుభాష్​ తెలిపారు.

bjp meeting in peddapalli district
'దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుంది'
author img

By

Published : Jun 11, 2020, 10:49 PM IST

రాబోయే రోజుల్లో భారతదేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్​వీ సుభాష్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణతో పాటు ఎన్​వీ సుభాష్ సమావేశమయ్యారు. ఆరు సంవత్సరాల నుంచి మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలిచిందని ఎన్​వీ సుభాష్​ అన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు.

ప్రపంచ దేశాలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయంటే దానికి కారణం భాజపా ప్రభుత్వమేనని సుభాష్ పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న సమస్యలను ప్రధాని నరేంద్రమోదీ సాహోసోపేత నిర్ణయాలతో పరిష్కరించారని గుర్తు చేశారు. అలాగే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: నూతన పురపాలక చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.