రాష్ట్ర భాజపా పిలుపు మేరకు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కమాన్‌పూర్, రామగిరి, మంథని మండలాల్లోని భాజపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ రాక ముందు సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పిన సీఎం కేసిఆర్.. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించారని నేతలు మండిపడ్డారు. 2023లో భాజపా అధికారంలోకి రాగానే.. రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:- 'ఆ సమస్యకు పరిష్కారం సీబీఎస్ఈ చేతిలో లేదు'