పెద్దపల్లి పురపాలక సంఘంలో భాజపా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గడ్డం వివేక్ పాల్గొన్నారు. పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలోని 36 స్థానాల్లో గెలుపొందాలని ఆయన సూచించారు.
కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి చర్యలను కూడా ప్రజలకు వివరించాలని తెలిపారు. పుర ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించాలని తెలిపారు.
ఇదీ చూడండి : 'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఏలా పెరిగాయి'