ETV Bharat / state

మానవీయ కోణంలో సమస్యలను పరిష్కరించాలి: డీసీపీ

మానవీయ కోణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం డీసీపీ అడ్మిన్​ అశోక్​ కుమార్​ అన్నారు. కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

awareness program to new appointed constables in peddapally district
మానవీయ కోణంలో సమస్యలను పరిష్కరించాలి: డీసీపీ
author img

By

Published : Oct 19, 2020, 9:37 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్​కు కొత్తగా వచ్చిన 137 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్ హాజరయ్యారు. కానిస్టేబుళ్ల స్వస్థలాలు, చదవు గురించి అడిగి తెలుసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సత్వర సేవలు అందించాలని అన్నారు.

పోలీస్ స్టేషన్​కు వచ్చే వారి పట్ల మానవీయ కోణంతో వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సేవలతో ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. పోలీస్ స్టేషన్​కి వచ్చిన వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రామగుండం కమిషనరేట్​, తెలంగాణ పోలీసులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. బయట విధులకు వెళ్లినప్పుడు క్రమశిక్షణతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, ఏఆర్ కమాండెంట్ సంజీవ్, ఏసీపీ ఏఆర్ సుందర్​ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నారాయణ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఎదురుచూపులే.. ఎంసెట్​ వెబ్​ ఆప్షన్లు ఎప్పుడో..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.