ETV Bharat / state

న్యాయవాదుల హత్యకేసులో మరొకరు అరెస్టు

author img

By

Published : Mar 10, 2021, 4:25 AM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనుకు సహకరించిన మంథనికి చెందిన కాపు అనిల్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

న్యాయవాదుల హత్యకేసులో మరొకరు అరెస్టు
న్యాయవాదుల హత్యకేసులో మరొకరు అరెస్టు

హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు-నాగమణి హత్యకేసులో మరొకరు అరెస్టు అయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనుకు సహకరించిన మంథనికి చెందిన కాపు అనిల్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మంగళవారం బిట్టు శ్రీనును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం విచారణ జరిపి అతడికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈ హత్య కేసులో బిట్టుశ్రీను నిందితులకు మారణాయుధాలు, వాహనం సమకూర్చాడని అభియోగాలున్నాయి.

మంగళవారం సాయంత్రం నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్​లను 164 సీఆర్​పీసీ వాంగ్మూలం కొరకు మంథని కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ముందు నిందితుల వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం వరంగల్​ కేంద్ర కారాగారానికి తరలించారు.

రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులుగా పనిచేస్తున్న మంథనికి చెందిన వామన్‌రావు-నాగమణి దంపతులు ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లాలో దారుణహత్యకు గురయ్యారు. కారులో హైదరాబాద్‌ వస్తుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద కుంట శ్రీను ఇతరులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: వామన్‌రావు దంపతుల హత్య కేసులో సాక్షుల వాంగ్మూలాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.