పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వడదెబ్బ తగిలి మృత్యువాత పడ్డారు. ఎండ తీవ్రత వల్ల పెగడపల్లిలోని రంగు వీరయ్య (70) ఏగోలపు రాజమ్మ(80) రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఇద్దరు మృతి చెందారు. వ్యవసాయ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన సంపంగి రాజ కొమురయ్యకు కూడా వడదెబ్బ తగిలింది. ఇంట్లో సేదతీరే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే గ్రామంలో ముగ్గురు వడదెబ్బతో మృతి చెందడంతో పెగడపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దపెల్లి జిల్లాలో ఈరోజు గరిష్టంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇవీ చూడండి : నిప్పుల కుంపటికి ఆవిరైతున్న ప్రాణాలు