నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన కిషన్‌రావు పటేల్ స్మారకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏర్పాటు చేశారు.
ఈ కుస్తీ పోటీల్లో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మల్లయోధులు పొటీపడ్డారు. రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలను తిలకించడానికి గ్రామస్థులు తండోతండాలుగా తరలివచ్చారు. కుస్తీ పోటీల్లో గెలిచిన మల్లయోధులకు 10 రూపాయల నుంచి 1001రూపాయల వరకు బహుమతులను ప్రదానం చేశారు.
ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్ చేసింది కలెక్టర్ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'