నిజామాబాద్ జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారిని గ్రామస్థులు నిర్బంధించారు. జిల్లాలోని కోటగిరి మండలం జల్దాపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులతో పాటు వీఆర్వో కృష్ణారెడ్డి హాజరయ్యారు. పట్టాపుస్తకాల గురించి వీఆర్వోను గ్రామస్థులు ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం రాలేదు. ఆగ్రహానికి గురైన గ్రామస్థులు అధికారిని నిర్బంధించి కార్యాలయానికి తాళం వేశారు. పంచాయతీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న కోటగిరి ఇంఛార్జీ తహసీల్దార్ విఠల్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల గ్రామస్థులు ఆందోళన విరమించారు. పాసు పుస్తకాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని... సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి : "ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరా"