ETV Bharat / state

అలీసాగర్ జలాశయం నుంచి నీటి విడుదల - flood water release from ali sagar

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ జలాశయం నుంచి నీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువ నుంచి వరద నీరు భారీగా ప్రాజెక్టులోకి చేరుతోంది.

water released from ali sagar reservoir at nizamabad district
అలీసాగర్ జలాశయం నుంచి నీటి విడుదల
author img

By

Published : Aug 21, 2020, 1:56 PM IST

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్​ జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. సింగీతం, కల్యాణి జలాశయాల నుంచి అలీసాగర్ ప్రాజెక్టులోకి 1,200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు ఒక గేటు ఎత్తి 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డి-41 నుంచి డి-49 కాలువల ద్వారా మరో 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని తెలిపారు.

శ్రీరాంసాగర్ కొనసాగుతోన్న వరద...

శ్రీరాంసాగర్​కు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1086 అడుగులకు చేరుకుంది. 60 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో కాగా... అవుట్​ప్లో 863 క్యూసెక్కులు. ప్రాజెక్టులో ప్రస్తుతం 70 టీఎంసీల నీటినిల్వ ఉంది. మరో 20 టీఎంసీలు వస్తే జలాశయం నిండుతుంది.

ఇదీ చూడండి: మేడ్చల్‌ మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.