నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారు. మోటారు చెడిపోయి మూడు రోజులుగా నీటి సరఫరా లేక నానా అవస్థలు పడుతున్నా... అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలోనూ... వేసవిని తలపిస్తోందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిని వివరణ కోరగా... మరమ్మతుకు ఇచ్చామని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: తల్లి కోసం కూతురి నిరాహార దీక్ష