నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడో అభిమాని. నిజామాబాద్‌కు చెందిన తెరాస నాయకుడు పబ్బ సాయిప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ (para gliding wishes)ద్వారా భారీ ఫ్లెక్సీతో శుభాకాంక్షలు తెలిపాడు. 40 ఫీట్ల పొడవున్న ఈ భారీ శుభాకాంక్షల ఫ్లెక్సీ ఆకాశంలో ఎగరగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గం నుంచి కవితకు ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశం వచ్చింది. 14 నెలల కాలానికి గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో ఆమె గెలుపొందారు. ప్రస్తుతం ఏకగ్రీవం అవుతారని అందరూ భావించారు. అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచారు. పరిశీలనలో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. కవిత విజయం లాంఛనమైంది. ఎట్టకేలకు పోలింగ్ లేకుండానే ఎన్నికలు ముగిశాయి. 26న అధికారికంగా ప్రకటించనున్నారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గారు రెండోసారి ఎన్నుకోబడినారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొండపోచమ్మ సాగర్ వద్ద పారాగ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో శుభాకాంక్షలు తెలిపినందుకు సంతోషిస్తున్నాను. -పబ్బ సాయిప్రసాద్, తెరాస నాయకుడు, కవిత అభిమాని
ఇదీ చదవండి:
MLC ELECTIONS 2021: స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు