ETV Bharat / state

దద్దరిల్లిన ఇందూరు... రోడ్డెక్కిన పసుపు రైతు - నిజామాబాద్ జిల్లా వార్తలు

ఇందూరు రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. పసుపు బోర్డు ఏర్పాటు, మద్ధతు ధర డిమాండ్లతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్ జిల్లాల రైతులు ఆందోళనకు తరలిరాగా... ఆచార్య నాగేశ్వర్ రైతులకు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. మద్దతు ధర ప్రకటించి బోర్డు ఏర్పాటు చేయాలని అన్నదాతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. నిరసనలో పార్టీల ప్రస్తావనతో కొంత వాగ్వాదానికి దారితీసింది. ఈనెల 20న తదుపరి కార్యచరణ ప్రకటించనున్నట్లు కర్షక సంఘాల నేతలు తెలిపారు.

మళ్లీ ఆందోళన బాట పట్టిన పసుపు రైతులు
మళ్లీ ఆందోళన బాట పట్టిన పసుపు రైతులు
author img

By

Published : Jan 9, 2021, 9:36 PM IST

మళ్లీ ఆందోళన బాట పట్టిన పసుపు రైతులు

నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు మద్దతు ధర కోసం మరోసారి ఆందోళన చేపట్టారు. ఆర్మూర్‌ మామిడిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పసుపు పంట చేతికొస్తున్న తరుణంలో మద్ధతు ధర కోసం రైతులు పోరాటం ఉద్ధృతం చేశారు. పసుపు పంటకు 15వేల మద్దతు ధరతో పాటు ఇచ్చిన హామీ మేరకు బోర్డు ఏర్పాటు చేయాలని నినదించారు. కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా పరిష్కారం చూపక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్దతు ధర ప్రకటించాలి

రైతు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన పసుపు రైతుల ఆందోళనకు ప్రముఖ విద్యావేత్త ఆచార్య కె.నాగేశ్వర్ రోడ్డుపై బైఠాయించి మద్దతు తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పసుపుబోర్డు ఏర్పాటుతో పాటు 15వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.

20న తదుపరి కార్యాచరణ ప్రకటన

ఆందోళనలో భాగంగా రైతులు పార్టీల ప్రస్తావన తేవడం కొంత వివాదానికి దారితీసింది. కొందరు తెరాస గురించి , ఇంకొందరు భాజపా గురించి మాట్లాడటం రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. రైతులు తమ తదుపరి కార్యాచరణను ఈనెల 20న ప్రకటిస్తామన్నారు. దశవారీ ఉద్యమం చేపట్టి మద్దతు ధర సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: జాతీయ రహదారిపై పసుపు రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.