నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 39వ రోజూ కొనసాగుతోంది. నగరంలోని ధర్నా చౌక్‌లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండా, న్యాయస్థానాలకు తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంతానికి పోకుండా కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని... వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఇవీ చూడండి: కొడవలితో మహిళ హల్‌చల్.. పింఛన్ కోసం బెదిరింపు