ప్రశ్న: ఆర్టీసీలో ఏ అంశానికి ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు..?
జవాబు: బస్సులను ప్రయాణికుల అవసరాలకు అనుకూలంగా నడపాలనేది తన మొదటి ప్రాధాన్యం. ప్రజలకు ఆర్టీసీపై నమ్మకం కలగాలి. సమయానికి బస్సులు రావాలన్నది ప్రయాణికుల ఆకాంక్ష. ఆర్టీసీకి రోజూ రూ.13 కోట్ల ఆదాయం వచ్చేది. కరోనా, ఇంధన ధరలు పెరగడం వల్ల సంస్థకు రోజుకు రూ.3 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది. ప్రస్తుతం రూ.10 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. ఇప్పటికే బడ్జెట్లో రూ.3,000 కోట్లు కేటాయించారు. ప్రణాళిక బడ్జెట్ కింద రూ.1,500 కోట్లు, ప్రణాళికేతర పద్దు కింద రూ.1,500 కోట్లు కేటాయించారు. ఆర్టీసీని బతికించుకోవాలనే ఉద్దేశ్యంతోనే (CM KCR)ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒక మంచి అధికారి సజ్జనార్‌ను ఎండీగా (TSRTC MD SAJJANAR), నన్ను ఛైర్మన్‌గా (TSRTC NEW CHAIRMAN BAJIREDDY GOVERDHAN) నియమించారు. సంస్థ లాభాలబాట పడుతుందో తెలియదు కానీ..నష్టాలు రాకుండా మాత్రం ఖచ్చితంగా చూడగలను.
ప్రశ్న : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు సంస్థ ఆస్తులను విక్రయిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం..?
జవాబు: కేంద్రం ప్రభుత్వం వెళ్లే మార్గాలను మేం వెతుక్కోవడం లేదు. ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీయకూడదని సీఎం కేసీఆర్‌కు తెలుసు. ప్రస్తుతం ఎన్ని ఆస్తులున్నాయి.. ఇంకా వాటిని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే సీఎం ఉన్నారు. అందుకే ఆర్టీసీకి రూ.3,000 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ఈవిధంగా కేటాయిస్తుందా...? అమ్మేస్తుంది లేకుంటే లీజుకు ఇస్తుంది. కరోనా సమయంలో దేశంలో మూడు నెలలు జీతాలు ఇవ్వలేకపోయారు. తెలంగాణలో మాత్రం కాస్త ఆలస్యమైనా జీతాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ లొసుగులున్నాయి. దేనివల్ల నష్టం వస్తోంది. వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు.. వంటి సమస్యలపై దృష్టిపెట్టాం.
ప్రశ్న: ఆర్టీసీ కార్మికులకు సమయానికి జీతాలు రావడంలేదు. కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదు..అని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు..?
జవాబు: నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నేను ఒకప్పుడు మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నాను. లాకౌట్ చేసినా ఎత్తివేయించాను. ఆర్టీసీ పెద్ద సంస్థ దీన్ని తొందరగా పరిగెత్తించడం సాధ్యం కాదు. మెల్లగా అభివృద్ధి చేస్తాం. ఇతర శాఖల వారికి ఇన్సెంటివ్‌లు వస్తున్నాయి. ఆర్టీసీ సిబ్బందికి అవి లేవు. కనీసం పదవి విరమణ పొందిన కార్మికులకు పింఛన్లూ ఉండవు. తప్పకుండా వారి బాగోగులు, సంక్షేమూ చూస్తాం. సంస్థ ఆదాయం పెరగాలంటే.. కార్మికుల సహకారం కూడా అవసరం.
ఇవీచూడండి: