ఈ విద్యా సంవత్సరంలోనైనా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని టీఆర్టీ అభ్యర్థులు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మద్దతుగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే టీఆర్టీ అభ్యర్థుల నియామకం చేపట్టడం లేదని వారు ఆరోపించారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి... 2018లో పరీక్షలు నిర్వహించారు. తుది ఫలితాలు ప్రకటించి ధ్రువ పత్రాలు కూడా పరిశీలించారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదని వాపోయారు.
కలెక్టరేట్ ఎదుట టీఆర్టీ అభ్యర్థులు ధర్నా - collectrate
ఉపాధ్యాయులుగా అర్హత సాధించి ఆరు నెలలు గడుస్తున్నా నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుందని టీఆర్టీ అభ్యర్థులు మండిపడ్డారు.
ఈ విద్యా సంవత్సరంలోనైనా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని టీఆర్టీ అభ్యర్థులు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మద్దతుగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే టీఆర్టీ అభ్యర్థుల నియామకం చేపట్టడం లేదని వారు ఆరోపించారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి... 2018లో పరీక్షలు నిర్వహించారు. తుది ఫలితాలు ప్రకటించి ధ్రువ పత్రాలు కూడా పరిశీలించారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదని వాపోయారు.
Body:ramakrishna
Conclusion:8106998398