రాజ్యసభ జీరో అవర్‌లో కృష్ణా జలాల వివాదంపై తెరాస ఎంపీ సురేశ్‌రెడ్డి ప్రస్తావించారు. కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆరేళ్లుగా కేంద్రానికి అనేక లేఖలు రాశారని సురేశ్‌రెడ్డి వెల్లడించారు.
బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌ను కొంతకాలం పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారని... దీనివల్ల వివాదాలు పూర్తిగా పరిష్కారం కావడం లేదన్నారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీ సురేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తాను వాడే మాస్కులపై కేటీఆర్ ట్వీట్