ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించడం ద్వారా పట్టభద్రులు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో సురభి వాణీదేవి గెలుపొందిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సంబురాలు చేశారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచారు.
సురభి వాణీదేవిని ఎన్నుకోవడం ద్వారా తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని మరోసారి చాటిచెప్పారని నీతూ కిరణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతీ పట్టభద్రుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఐడీసీఎమ్ఎస్ ఛైర్మన్ సాంబారు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆమె విజయం ఓ చారిత్రక సందర్భం: కేవీ రమణాచారి