నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో అక్రమ కలపను అడ్డుకున్న అటవీ శాఖ అధికారులపై గిరిజనులు దాడి చేసి చితకబాదారు. బదావత్ సురేశ్, బదావత్ రాంసింగ్, బదావత్ గంగారాం, బుక్యా లింబ అనే నలుగురు అక్రమంగా కలపను ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పట్టుకోని స్టేషన్కు తరలించే క్రమంలో వారు పోలీసులపై కర్రలతో దాడి చేశారని ఎస్సై వెల్లడించారు. తీవ్ర గాయాలైన అటవీ అధికారులు భీంగల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె