నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో.. నియోజకవర్గలోని 25 గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే షకీల్ అమీర్ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో ప్రతి గ్రామం సస్యశ్యామలంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
పంపిణీ చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే విధంగా అధికారులు, నాయకులు తోడ్పడాలని ఆయన అన్నారు. మార్చి7వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా తనకు ఎలాంటి బొకేలు, పూల దండలు తీసుకుని రావొద్దని ఎమ్మెల్యే షకీల్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బులతో ఎవరైనా పేదలకు ఉపయోగపడే విధంగా చేయాలని సూచించారు.