ఇవీ చూడండి: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
అక్షరాభ్యాసం కోసం బాసర వెళ్తూ... అనంతలోకాలకు - గుంటూరు వాసులు
కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సదాశివనగర్ మండలం అడ్లూరులో అదుపుతప్పిన కారు డివైడర్‌ను దాటి అవతలి రోడ్డులో వస్తున్న లారీని ఢీకొట్టింది. కారు బలంగా ఢీ కొనడం వల్ల లారీలోని డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించగా.. లారీ పూర్తిగా దగ్ధమైంది.
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. రాకేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి బాసర ఆలయంలో అక్షరాభ్యాసం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ బావ మరిది, రాకేష్ భార్య, అత్తమ్మ అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. రాకేష్‌కు కుడి భుజం విరిగగా.. తన మూడేళ్ళ కుమారుడు అభిరామ్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని కామారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి అవతలి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. లారీ డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. బాధితులు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్న గుంటూరు వాసులుగా గుర్తించారు.
ఇవీ చూడండి: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
TG_NZB_01_27_ACCIDENT_3DEAD_AV_R21
Reporter: Srishylam.K, Camera: Manoj
(. ) కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న లారీని డీ కొట్టింది. ఈ ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. రాకేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి హైద్రాబాద్ నుంచి బాసర ఆలయంలో అక్షరాభ్యాసం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ బావ మరిది, భార్య, అత్తమ్మ సంఘటన స్థలంలోనే చనిపోగా రాకేష్ కు కుడి భుజం విరిగింది. రాకేష్ మూడేళ్ళ కుమారుడు అభిరామ్ కు స్వల్ప గాయాలు కాగా.. కామారెడ్డి లోని ఆసుపత్రికి తరలించారు. కాగా కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి అవతలి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కారు బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంక్ పగిలి లారీలో మంటలు వ్యాపించి లారీ పూర్తిగా దగ్దమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. బాధిత కుటుంబ సభ్యులది హైదరాబాద్ లోని వనస్థలిపురానికి చెందిన వారీగా గుర్తించారు..... vis