సీఐటీయూ ఆధ్వర్యంలో జీతాలు పెంచాలంటూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే అది కేవలం తమ శ్రమతోనే సాధ్యమని పారిశుద్ధ్య కార్మికులు అన్నారు. ఇలాంటి పనులు డబ్బులు ఎక్కువ ఇచ్చినా చేసే వారు ఉండరన్నారు. ఇంత పని చేస్తున్నా తమకు జీతాలు ఆశించినంతగా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించినప్పటికీ అమలు మాత్రం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : సమస్యలు పరిష్కరించకుంటే ఉగ్రరూపమే..