నిజామాబాద్‌లోని సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీపై దాదాపు 500 పైన కార్మికులు, పదివేల మంది రైతు కుటుంబాలు... ఆధారపడి జీవిస్తున్నాయని ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు కొండ సాయిరెడ్డి అన్నారు. వెంటనే ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభం కోసం మార్చ్ 15 నుంచి సుమారు 108 గ్రామాల్లో పరిరక్షణ కమిటీ పాదయాత్రను చేపట్టిందని సాయిరెడ్డి తెలిపారు. ప్రైవేటు కంపెనీల కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫ్యాక్టరీని నష్టాల్లో ఉందని చెప్పి మూసివేయటం సరికాదని పేర్కొన్నారు. కొందరు ఫ్యాక్టరీ భూములను బలవంతంగా కొనేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి ప్రభుత్వమే నడిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: టీకా కోసం గాంధీ ఆస్పత్రికి క్యూ కట్టిన ప్రజలు