నిజామాబాద్ జిల్లాలో ఓ మేకల సంత వేలంపాటకు అత్యధిక ధర దక్కింది. నవీపేటలో ప్రతి శనివారం మేకల సంత నిర్వహిస్తారు. దీని నిర్వహణను పంచాయతీ వేలం ద్వారా అప్పగిస్తారు. గత 24 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేలంపాట రికార్డు సృష్టించిందని పంచాయతీ వర్గాలు చెబుతున్నారు.
పంచాయతీ కార్యాలయంలో అధికారులు వేలంపాట నిర్వహించగా 80 మంది పాల్గొన్నారు. నవీపేటకు చెందిన మజారుద్దీన్ అనే వ్యక్తి రూ.40,77,000లకు సంత దక్కించుకున్నారు. గతేడాది రూ. 17 లక్షలు పలికిన వేలం.. ఈసారి మాత్రం 40 లక్షల రూపాయలు దాటింది.
ఇదీ చదవండిః కరోనా నుంచి కాపాడుకోండిలా!