ETV Bharat / state

JPS reaction on Govt warning : బెదిరించినా.. తగ్గేదేలే

author img

By

Published : May 13, 2023, 2:34 PM IST

Updated : May 13, 2023, 7:57 PM IST

Junior panchayat secretaries continue to protest : విధులకు హాజరుకావాలని ప్రభుత్వం విధించిన మరోగడువును జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు బేఖాతరు చేశారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్‌తో 16వరోజూ సమ్మెను యథాతథంగా కొనసాగించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆత్మహత్య చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి.

JPS reaction on Govt warning
JPS reaction on Govt warning
ప్రభుత్వం హెచ్చిరించిన.. నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు

Junior panchayat secretaries continue to protest : ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో సమ్మెబాట పట్టిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు మరోసారి ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోలేదు. ఇప్పటికే సోమవారం వరకు గడువు విధించిన సర్కార్‌.. మరో దఫా శనివారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చింది. ఈలోగా విధుల్లో హాజరుకావాలని లేకుంటే.. వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు యథావిధిగా సమ్మెను కొనసాగించారు. 16వ రోజు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మృతి చెందిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి సోనికి నిరసన శిబిరాల్లో నివాళులు అర్పించారు.

వారిని తొలగిస్తే.. కేసీఆర్​ ప్రభుత్వం పడిపోతుంది : నిర్మల్‌లో ప్రభుత్వం విధించిన గడువు దాటిందంటూ కార్యదర్శులు ప్లకార్డులు ప్రదర్శించారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముందు ధర్నాచౌక్ వద్ద ఒంటికాలిపై నిలబడి జేపీఎస్​లు నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ధర్నాచౌక్ వద్ద తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని నినాదించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల కేసీఆర్​ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. నాలుగేళ్లుగా వారితో పని చేయించుకొని ఇపుడు వారి బలవన్మరణానికి కారణమవుతున్నారని ఆరోపించారు. కరీంనగర్‌లో జేపీఎస్​లకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. నిరసన శిబిరానికి వెళ్లిన ఆయన.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తొలగిస్తే.. కేసీఆర్​ ప్రభుత్వమే పడిపోతుందని హెచ్చరించారు.

"మాలో చాలా మంది పెద్ద చదువులు చదివినా.. ప్రభుత్వం ఉద్యోగం అనే ధీమాతో చేరాం. ఇందులో మాకు భద్రత లేదు. మా సమస్యను ప్రభుత్వానికి చెబుతున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులమే. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చెయ్యలేదు. మాకు ఆరోగ్య భద్రత లేదు. ఇలాంటి సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేసేందుకే శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం." -జూనియర్​ పంచాయతీ కార్యదర్శి

"జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల విషయంలో టెర్మినేషన్​ అంటున్న పదం వారికి కాదు కేసీఆర్​ ప్రభుత్వానికి వర్తింప చేయాలి. జేపీఎస్​లు వారి నియామక పత్రాలను తీసుకుని వళ్లితే ఎవరైనా న్యాయం చేస్తారు. ఈ పోస్ట్​లో మళ్లీ కేడర్​ను విభజించాలనే సందిగ్ధత లేదని నేను అంటున్నాను."- జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ

ప్రభుత్వ తీరుతోనే సోనీ ఆత్మహత్య చేసుకుంది : వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆత్మహత్య చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి అంత్యక్రియలు విషణ్ణ వదనాల మధ్య ముగిశాయి. సోనికి వీడ్కోలు పలికేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జేపీఎస్​లు తరలివచ్చి.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుతోనే సోని ఆత్మహత్యకు పాల్పడిందని పంచాయతీ కార్యదర్శులు ఆరోపించారు. జేపీఎస్​ మృతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటుచేశారు.

ఇవీ చదవండి:

Last Updated : May 13, 2023, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.